Page Loader
Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం 
మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం

Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖండవా జిల్లాలోని ఒక గ్రామంలో ఓ గిరిజన మహిళ (45) పై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె ప్రైవేటు భాగాల్లోకి ఇనుప రాడ్డును చొప్పించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖండవా జిల్లాలోని ఓ గ్రామంలో వివాహ కార్యక్రమం జరిగింది. ఆ వేడుకకు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బాధితురాలు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ వివాహానికి హాజరైంది.అయితే అదే రాత్రి ఆమె అనూహ్యంగా కనబడకుండా పోయింది. శనివారం,గ్రామంలోని ఒక ఇంటి వెనుకభాగంలో ఓ ఇంటి వెనుక బాధితురాలు పడి ఉండటాన్ని కొందరు మహిళలు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వివరాలు 

పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబం 

గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను వారు ఇంటికి తీసుకెళ్లగా,తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పే ప్రయత్నంలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. చాలాచోట్ల తీవ్రమైన గాయాల గుర్తులతో శరీరం రక్తమోడుతోంది. మహిళ మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఖండవాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,వైద్యులు గర్భాశయం కూడా బయటకు వచ్చినట్లు తెలిపారు. ఇంతటి క్రూరమైన అఘాయిత్యం నేపథ్యంలో బాధిత కుటుంబం శనివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన రోశ్నీ చౌకీ పోలీసులు గాలింపు చేపట్టారు. విచారణలో భాగంగా బాధితురాలి గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. మహిళపై జరిగిన నేరాన్ని నిర్ధారించిన పోలీసులు, నిందితుల విచారణ కొనసాగుతోందని ఖండవా ఏఎస్పీ రాజేశ్ రఘువంశీ తెలిపారు.