Page Loader
తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య
తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య

తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య

వ్రాసిన వారు Stalin
May 02, 2023
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

తీహార్ మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థి ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడంతో టిల్లు తాజ్‌పురియా మరణించినట్లు మంగళవారం జైలు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 24, 2021న దిల్లీలోని రోహిణి కోర్టులో న్యాయవాదుల వేషధారణలో వచ్చిన తాజ్‌పురియా సహచరులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని హత్య చేశారు. ఈ హత్యకు టిల్లు కుట్ర పన్నినట్లు పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఇప్పుడు అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న జితేందర్ గోగి గ్యాంగ్‌‌కు చెందిన యోగేష్ అలియాస్ తుండా, దీపక్ తీటర్ ఇనుప రాడ్‌తో తాజ్‌పురియాపై దాడి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

తిహార్

దశాబ్ద కాలంగా తాజ్‌పురియా, జితేందర్ గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు

గాయాలతో పడి ఉన్న తాజ్‌పురియాను దిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సునీల్ మాన్ అలియాస్ టిల్లు తాజ్‌పురియా దిల్లీలోని ఒక పేరుమోసిన క్రిమినల్ గ్యాంగ్‌కు నాయకుడు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి‌కు తాజ్‌పురియాకు మధ్య గత పదేళ్లుగా అధిపత్య పోరు నడుస్తోంది. దశాబ్ద కాలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలలో రెండు డజన్ల మందికి పైగా మరణించారు. రెండు ముఠాల సభ్యులు కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీలు, దోపిడీలు, కార్‌జాకింగ్ కేసులలో ప్రస్తుతం అరెస్టు అయి జైలు శిక్షఅనుభవిస్తున్నారు.