Page Loader
గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స
గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్

గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2023
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థకు గురి కావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయగా, బ్రెయిన్ స్ట్రోక్ గురైనట్లు గుర్తించారు. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు స్కానింగ్ లో తేలడంతో ఆ వెంటనే కొండేటి చిట్టిబాబును హుటాహుటినా హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు పేర్కొన్నారు.

Details

కొండేటి చిట్టిబాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

చిట్టిబాబు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. కొండేటి చిట్టిబాటు అనారోగ్యానికి గురైన విషయాన్ని తెలుసుకున్న పి.గన్నవరం నియోజకవర్గ నాయకులు, ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కొండేటి చిట్టిబాబు కుమారుడు మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని చెప్పారు.