LOADING...
Bengaluru: బెంగళూరులో నిమ్మరసానికి గ్యాస్‌ ఛార్జ్‌.. వినియోగదారుల ఆగ్రహం

Bengaluru: బెంగళూరులో నిమ్మరసానికి గ్యాస్‌ ఛార్జ్‌.. వినియోగదారుల ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాస్‌ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు వినియోగదారుల జేబులపై పడుతోంది. కర్ణాటకలోని ఓ హోటల్‌ ఈ పరిస్థితిని కారణంగా చూపుతూ బిల్లులో 'గ్యాస్‌ సంక్షోభ ఛార్జ్‌' పేరుతో అదనంగా 5 శాతం వసూలు చేయడం వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఈ అదనపు ఛార్జ్‌ను నిమ్మకాయ రసం వంటి సాధారణ పానీయంపై వేయడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆదివారం బెంగళూరులోని ఒక కేఫ్‌కు వెళ్లిన కొందరు వినియోగదారులు నిమ్మకాయ జ్యూస్‌ ఆర్డర్‌ చేశారు. తర్వాత బిల్లు చూసిన వారు ఆశ్చర్యపోయారు. రెండు జ్యూస్‌లకు మొత్తం రూ.358 వసూలు చేయడంతో పాటు, 'గ్యాస్‌ క్రైసిస్‌ ఛార్జ్‌' పేరిట అదనంగా 5 శాతం, అంటే రూ.17.01 చేర్చారు.

వివరాలు 

హోటల్‌కు నోటీసులు

నిమ్మకాయ జ్యూస్‌కు గ్యాస్‌తో సంబంధమేంటి? అనే ప్రశ్నతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో, సంబంధిత హోటల్‌పై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు,వినియోగదారుల హక్కుల కమిషన్‌ స్పందించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని ఆ హోటల్‌కు నోటీసులు జారీ చేసింది.

Advertisement