Page Loader
Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత 
విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత

Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 29, 2023
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మధురవాడ వాంబై కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ (Gas Leak) ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ నలుగురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వారం రోజులుగా వారు కెజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిలో మొన్న(సోమవారం) ఇద్దరు కుమారులు మృతి చెందారు.

Details

భార్యభర్తలు మృతి

మంగళవారం రాత్రి భార్యభర్తలు మృతి చెందారు. మృతులు యామల బాలరాజు (60), యామల చిన్ని(55), యామల గిరి (21) యామల కార్తిక్ (20) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.