LOADING...
LPG Shortage: ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్‌ ఎత్తుకెళ్లిన దొంగ.. బెంగళూరులో ఘటన

LPG Shortage: ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్‌ ఎత్తుకెళ్లిన దొంగ.. బెంగళూరులో ఘటన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బెంగళూరులో జరిగిన రెండు ఘటనలు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయి. బెంగళూరులోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగ ఇంట్లోకి చొరబడి గ్యాస్‌ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నగరంలోని మరో ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గ్యాస్‌ సిలిండర్‌ను దొంగిలించి బైక్‌పై తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు బయటపెట్టారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బెంగళూరులో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి.. సిలిండర్‌ను దొంగలించి, అక్కడి నుంచి పరార్

Advertisement