Maharashtra: గెయిల్ పైప్‌లైన్‌లో గ్యాస్ లీక్.. 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లింపు
ఈ వార్తాకథనం ఏంటి
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను మళ్లించారు. శనివారం సాయంత్రం సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో గెయిల్ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుంది.
వివరాలు
పైప్‌లైన్‌కు ఇరువైపులా ఉన్న వాల్వ్‌లను మూసివేసేందుకు చర్యలు
అక్కడ అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచింది. పైప్‌లైన్‌కు ఇరువైపులా ఉన్న వాల్వ్‌లను మూసివేసేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు.
గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు అధికారులు, నిపుణులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్‌ను ధూలే-సోలాపూర్ హైవే వైపు మళ్లించారు.
నాగ్‌పుర్ నుంచి ముంబయి వైపు వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.