వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను మహువా మోయిత్రా తిరస్కరించారు. అవన్నీ వాస్తవం కాదని పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను మాత్రం తన మిత్రుడు, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచ్చిన మాట వాస్తవమేనని మోయిత్రా ఒప్పుకున్నారు. అయితే ఎవరు లాగిన్ అవ్వాలి, ఎవరు చేయకూడదు అనేది రూల్ లేనందున దర్శన్ హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్, పాస్‌వర్డ్ ఇచ్చానని మొయిత్రా చెప్పారు.
ఓటీపీ నాకే వస్తుంది: మోయిత్రా
ఏ ఎంపీ కూడా తన ఒక్కరి వద్దే లాగిన్, పాస్‌వర్డ్‌లను ఉంచుకోరని, అతని సహాయకుల వద్ద కూడా ఉంచుతారని మోయిత్రా పేర్కొన్నారు. అయితే తన ఐడీ, పాస్‌వర్డ్ ఎవరి వద్ద ఉన్నా.. అది ఓపెన్ కావడానికి అవసరమయ్యే ఓటీపీ నెంబర్ నంబర్ తన ఒక్కరి ఫోన్‌కే వస్తుందని దాని వద్ద, లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ దుర్వినియోగం అవడానికి అవకాశం లేదన్నారు. తనను బెదిరించడానికి వారు తప్పుడు వ్యవక్తిని ఎంచుకున్నట్లు మోయిత్రా ఆరోపించారు. జార్ఖండి పిట్‌బుల్స్ అన్నీ పూర్తి చేయలేవన్నారు. తాను నిజం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. 2024లో ఏమి జరుగుతుందో మీరు చూస్తారని వెల్లడించారు. దర్శన్ హీరానందని దుబాయ్ నుంచి లాగిన్ అయ్యాడన్న ఆరోపణ హాస్యాస్పదమన్నారు.
నవంబర్ 2న ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరు కావాల్సిందే..
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా నవంబర్ 2న హాజరు కావాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ శనివారం స్పష్టం చేసింది. అయితే తొలుత అక్టోబర్ 31న హాజరు కావాలని ఎథిక్స్ కమిటీ మొయిత్రా సూచించింది. అయితే తాను అందుబాటులో ఉండటం లేదని నవంబర్ 5 తర్వాతే అందుబాటులో ఉంటానని కమిటీకి లేఖ రాసింది. ఈ క్రమంలో నవంబర్ 2న విచారణకు హాజరుకావాల్సిందేనని కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇక ఆ తర్వాత పొడిగింపు అనేది ఉండదని స్పష్టం చేసింది.