పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హైకమిషన్‌గా గీతిక శ్రీవాస్తవ నియామకం
పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్, ఇన్‌చార్జ్ హై కమిషనర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారిణి గీతికా శ్రీవాస్తవను కేంద్ర ప్రభుత్వం నియమించింది. చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయ మహిళా అధికారి పాకిస్థాన్‌లోని ఇండియన్ హైకమిషర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్థాన్‌లో భారత హైకమిషనర్‌గా గీతిక నియామకాన్ని పాక్ వార్తాపత్రిక ధృవీకరించింది. గీతిక శ్రీవాస్తవ 2005బ్యాచ్ ఏఎఫ్ఎస్ అధికారిణి. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. గీతిక తన కెరీర్‌లో ఎక్కువ భాగం చైనాలో గడిపారు. అంతకుముందు ఆమె కోల్‌కతాలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా కూడా పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఐఓఆర్ విభాగంలో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ పసిఫిక్ విభాగంలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.