LOADING...
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ… కొత్తగా పెళ్లైన వారికి సింపుల్ ప్రాసెస్!
ఏపీలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ… కొత్తగా పెళ్లైన వారికి సింపుల్ ప్రాసెస్!

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ… కొత్తగా పెళ్లైన వారికి సింపుల్ ప్రాసెస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీరు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా? ఎలా అప్లై చేయాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి వంటి సందేహాలు ఉన్నాయా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా మంచి వార్త. గతంలో రేషన్ కార్డుల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక నిబంధనలు, కఠినమైన ప్రక్రియలు ఉండేవి. ఇలా రేషన్ కార్డు పొందడం ఒక పెద్ద తలనొప్పిగా మారేది. అయితే ఇప్పుడు ఈ ఇబ్బందులన్నీ తప్పనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసింది. ఇకపై ఎవరికైనా, ఎప్పుడైనా కావాల్సిన కొత్త రేషన్ కార్డును చాలా ఈజీగా పొందొచ్చు. పెద్దగా శ్రమ అవసరం లేకుండా సులభమైన విధానంలో కార్డులు అందుబాటులోకి వస్తాయి.

Details

సచివాలయాల్లో కొత్త వ్యవస్థ 

కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించే బాధ్యతను ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించింది. దీంతో ప్రజలు తమ ఇంటికి దగ్గరలోనే ఈ సేవలను పొందగలుగుతున్నారు. ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు జారీ సమయ పట్టిక జనవరి - జూన్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో రేషన్ కార్డులు ఇస్తారు. జూలై - డిసెంబర్ మధ్య అప్లై చేసిన వారికి తదుపరి ఏడాది జనవరిలో కార్డులు మంజూరు చేస్తారు.

Details

కొత్తగా పెళ్లైన దంపతులకు ఇక సులభం 

కొత్తగా వివాహం చేసుకున్న వారు కూడా ఇప్పుడు చాలా సులభంగా రేషన్ కార్డు పొందొచ్చు. ఇందుకు అవసరమయ్యేవి ఇద్దరి ఆధార్ కార్డులు మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రభుత్వ పోర్టల్‌లో ఉన్న 'Marriage Split' ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు, భార్యను తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి తొలగించేంతవరకు కొత్త కార్డు రావడం చాలా ఆలస్యమయ్యేది. కానీ ఇప్పుడు ఆ సమస్యలు లేవు. భార్య-భర్త ఆధార్ కార్డులు, భర్త పాత రేషన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్‌తో అప్లై చేస్తే:

Details

మరిన్ని వివరాలు ఇవే

1. వారి వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు 2. ఒక ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారు 3. adhar e-KYC పూర్తిచేస్తారు 4. తర్వాత ఫైల్‌ను VRO, తహసీల్దార్ పరిశీలనకు పంపుతారు 5. ఆమోదం వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డు జారీ అవుతుంది ఈ ప్రక్రియలో ఉన్నంతవరకు, భార్యకు ఆమె అత్తింటి రేషన్ కార్డు ద్వారా రేషన్ అందజేస్తారు. పిల్లల పేర్లు చేర్చడం, అడ్రస్ మార్చడం కూడా సులభం రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చాలంటే అవసరమైన పత్రాలు: పిల్లల ఆధార్ కార్డులు జనన సర్టిఫికెట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డు వీటిని డిజిటల్ అసిస్టెంట్లు నమోదు చేసిన తర్వాత వీఆర్ఓ, తహశీల్దార్ పరిశీలన చేసి ఆమోదిస్తారు.