Page Loader
Bullet Train: ఘాన్సోలీ-శిల్‌ఫటా టన్నెల్ ప్రారంభం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు!
ఘాన్సోలీ-శిల్‌ఫటా టన్నెల్ ప్రారంభం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు!

Bullet Train: ఘాన్సోలీ-శిల్‌ఫటా టన్నెల్ ప్రారంభం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న 508 కిలోమీటర్ల బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా జపాన్ రూపొందించిన అత్యాధునిక E10 షింకాన్సెన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు జపాన్ ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అండర్‌సీ టన్నెల్‌లో తొలి విభాగం పూర్తి బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రపు టన్నెల్ నిర్మాణంలో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాదు 310 కిలోమీటర్ల పైవంతెన నిర్మాణాన్ని కూడా పూర్తి చేసినట్లు తెలిపింది.

Details

వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు

ప్రాజెక్టులో భాగంగా ట్రాక్ వేసే పని, ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లు, స్టేషన్లు, బ్రిడ్జిల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపింది. ప్రత్యేకంగా మహారాష్ట్రలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో, బులెట్ ట్రైన్ నిర్వహణ కోసం అవసరమైన సాంకేతిక వ్యవస్థల కొనుగోళ్ల ప్రక్రియ కూడా సమాంతరంగా జరుపుతున్నట్లు పేర్కొంది. E10 షింకాన్సెన్‌ రైళ్లు.. కొత్త అధ్యాయం ప్రస్తుతం జపాన్‌లో నడుస్తున్న E5 షింకాన్సెన్ రైళ్లను మించిన నూతన తరం E10 రైళ్లు భారత బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో నడిచేలా జపాన్ అంగీకరించిందని కేంద్రం వెల్లడించింది. మొత్తం 508 కిలోమీటర్ల ప్రాజెక్టు జపాన్ షింకాన్సెన్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చెందుతోంది.

Details

స్టేషన్లు, బ్రిడ్జ్‌లు.. అభివృద్ధి చరమదశలో

ప్రాజెక్టులోని 12 స్టేషన్లలో ఇప్పటికే 5 స్టేషన్ల నిర్మాణం పూర్తయినట్టు, ఇంకా మూడు స్టేషన్లు పూర్తయ్యే దశకు చేరుకున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే 15 నదులపై బ్రిడ్జిలు నిర్మాణం పూర్తయింది. మరో నాలుగు బ్రిడ్జిలు నిర్మాణం తుదిదశలో ఉన్నట్లు తెలిపింది. BKC స్టేషన్‌ - ఇంజనీరింగ్ అద్భుతం ముంబయిలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో నిర్మిస్తున్న స్టేషన్‌ను మంత్రిత్వ శాఖ ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంది. ఇది భూమి నుండి 32.5 మీటర్ల లోతులో నిర్మించబడుతుండగా, దీని పైభాగంలో 95 మీటర్ల ఎత్తుగల భవనం నిర్మించేందుకు అనుకూలంగా ఈ స్టేషన్ ఫౌండేషన్‌ను రూపొందించారని వెల్లడించింది.

Details

భవిష్యత్తు బులెట్ ట్రైన్ కారిడార్లకు బలం

ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశంలో మరిన్ని బులెట్ ట్రైన్ కారిడార్లకు బోణీ పడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే భవిష్యత్తు కారిడార్లపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.