LOADING...
Video: ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం 
ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం

Video: ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆహారం ఆలస్యంగా అందిందన్న కారణంతో ఓ హోటల్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఘజియాబాద్‌లో ఉన్న 'అప్నీ రసోయ్‌' అనే రెస్టారెంట్‌లో జరిగింది. అక్కడికి వచ్చిన కొంతమంది యువకులు తమకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్‌ చేశారు. అయితే ఆర్డర్‌ చేసిన భోజనం తీసుకురావడంలో ఆలస్యం జరగడంతో వారు హోటల్‌ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. తీవ్ర స్థాయిలో వాదనలు జరిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొద్ది సమయం గడిచిన తర్వాత మరో ఆరేడు మందితో కలిసి వచ్చిన దుండగులు మోటారు సైకిళ్లపై హోటల్‌కు వచ్చి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు.

వివరాలు 

హోటల్‌లో ఫర్నీచర్‌ మొత్తం ధ్వంసం 

వాళ్లు తెచ్చుకున్న ఇనుప రాడ్లు, కట్టెలతో హోటల్‌లోని ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టెలివిజన్‌, బిల్లింగ్‌ మెషిన్‌ను పగలగొట్టారు. హోటల్‌లో ఉన్న ఫర్నీచర్‌ మొత్తం ధ్వంసం చేశారు. అంతేగాక కౌంటర్‌లో ఉన్న రూ.1760 నగదును తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగే సమయంలో హోటల్‌లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు సహా పలువురు భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ దాడి మొత్తం హోటల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఘటన అనంతరం హోటల్‌ యజమాని అక్షిత్‌ త్యాగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. దుండగులను పట్టుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హోటల్ ధ్వంసం చేసిన వీడియో