Page Loader
Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు
గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు

Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటలకు గ్యాస్‌ సిలిండర్ల లోడ్ తో వెళుతున్న ఒక ట్రక్కు ఘజియాబాద్‌ సమీపంలోని భోపురా చౌక్‌ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. క్షణాల్లో ఒకదాని తర్వాత మరొకటి 50 సిలిండర్ల పేలిపోయాయి.. ఈ పేలుడుతో భారీ మంటలు ఆకాశానికి ఎగసిపడ్డాయి. పేలుడు ధ్వని రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.

వివరాలు 

ఇల్లు, గోదాము ధ్వంసం 

పేలుడుకు కారణంగా ఒక ఇల్లు, గోదాము ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. పేలుడు ధ్వనిని వినిపించిన సమయంలో, ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకు వచ్చారని పోలీసులు తెలిపారు. ట్రక్కులో 100 సిలిండర్ల వరకు ఉన్నాయని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు