Ghaziabad: ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన.. ఎంగిలి ప్లేట్లు తాకాయని వెయిటర్‌ను చంపేశారు!
ఈ వార్తాకథనం ఏంటి
ఓవివాహ వేడుకలో ఎంగిలి ట్రే శుభ్రం చేసేందుకు తీసుకెళుతుండగా అవికాస్తా కొంతమంది అతిథులను తాకడంతో వారు వెయిటర్‌ను కొట్టి చంపేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో గత నెల నవంబర్ 17న ఈ ఘటన జరిగింది.బాధితుడు పంకజ్ అంకుర్ విహార్‌లోని సీజీఎస్ వాటికలో వెయిటర్‌గా పనిచేస్తున్నారు.
వేడుకలో పంకజ్ తీసుకెళ్లిన ప్లేట్ల ట్రే రిషబ్, అతని ఇద్దరు స్నేహితులకు తాకడంతో గొడవ మొదలైంది.
కోపంతో ఊగిపోయిన రిషబ్ అతని స్నేహితులు మనోజ్,అమిత్ తో కలిసి పంకజ్‌ను చితకబాడడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.
దొరికిపోతామనే భయంతో రిషబ్,అతడి స్నేహితులు మృతదేహాన్నిసమీపంలోని అడవిలో దాచారు.
ఘటన జరిగిన ఒకరోజు తర్వాత పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.తాజాగా, పరారీలో ఉన్న నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎంగిలి ప్లేట్లు తాకాయని వెయిటర్‌ను చంపేశారు!
At Ghaziabad wedding, waiter beaten to death over ‘jootha’ tray touching guests | Delhi Newshttps://t.co/C9xBQqBW5J
— Mr Zubair (@MrZubai08999659) December 7, 2023