GHMC: రామానాయుడు,అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు షాకిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజును పూర్తిగా చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. స్టూడియోలు నిజానికి చెల్లించాల్సిన మొత్తాన్ని కన్నా చాలా తక్కువగా ఫీజు చూపిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 విభాగం గుర్తించినట్టు తెలుస్తోంది. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి పెద్ద మొత్తంలో పన్నులు తప్పించుకున్నట్టు అధికారులు తేల్చారు. దీంతో వెంటనే రెండు స్టూడియోలకూ నోటీసులు పంపించారు.
వివరాలు
చెల్లించాల్సిన ఫీజు
వివరాల్లోకి వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో అసలు చెల్లించాల్సిన ఫీజు రూ.11.52 లక్షలు. కానీ ఇప్పటివరకు వారు కేవలం రూ.49 వేలే చెల్లిస్తున్నట్టు బయటపడింది. రామానాయుడు స్టూడియో విషయానికి వస్తే, వారి బిల్లింగ్ మొత్తం రూ.1.92 లక్షలు ఉండాలి. అయితే వారు చెల్లిస్తున్నది కేవలం రూ.1,900 మాత్రమేనని అధికారులు వెల్లడించారు.