Visakhapatnam: పర్యాటకులకు శుభవార్త.. విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన ఆహ్లాదకరమైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యాటకాభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. విశాఖపట్నాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వివరాలు
భవిష్యత్తులో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు
సహజ విపత్తులు సంభవించినా భద్రంగా నిలబడేలా గ్లాస్ బ్రిడ్జిని అత్యంత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందించామని చెప్పారు. అలాగే సమీప భవిష్యత్తులో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 40 ఎంఎం మందం ఉన్న ల్యామినేటెడ్ గాజును ఉపయోగించగా, ఈ గాజును జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. ఒకేసారి సుమారు 500 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఇందులో ఉంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు కూడా ఇది స్థిరంగా తట్టుకునేలా రూపొందించారు. అంతేకాకుండా ఒక సమయంలో 40 మంది పర్యాటకులు ఈ బ్రిడ్జిపైకి వెళ్లి కైలాసగిరి చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే అవకాశం కల్పించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
— greatandhra (@greatandhranews) December 1, 2025
దేశంలోనే అతి పొడవైన ఈ వంతెన, కేరళ 40 మీటర్ల రికార్డును బ్రేక్ చేసింది.
₹7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్, రాత్రివేళ త్రివర్ణ లైటింగ్‌తో మెరిసిపోతుంది. pic.twitter.com/ycsuda6mJA