LOADING...
PM Modi: మన టెక్నాలజీకి గ్లోబల్ ప్రశంసలు.. ప్రపంచం ఆశ్చర్యపోయిందన్న నరేంద్ర మోదీ
మన టెక్నాలజీకి గ్లోబల్ ప్రశంసలు.. ప్రపంచం ఆశ్చర్యపోయిందన్న నరేంద్ర మోదీ

PM Modi: మన టెక్నాలజీకి గ్లోబల్ ప్రశంసలు.. ప్రపంచం ఆశ్చర్యపోయిందన్న నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఏఐ ఇంపాక్టు సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమిట్‌లో ముఖ్యంగా రెండు భారత ఆవిష్కరణలు గ్లోబల్ నాయకులను ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పారు. జంతువుల చికిత్స, వాటి ట్రాకింగ్ కోసం కృత్రిమ మేధస్సు వినియోగం ఒకటి కాగా, భారత ప్రాచీన గ్రంథాలు, సాంప్రదాయ జ్ఞానాన్ని సంరక్షించడానికి ఏఐను ఉపయోగించడం మరోటి అని వివరించారు. ఈ రెండు అంశాలపై ప్రపంచ నేతలు ప్రశంసలు కురిపించారని తెలిపారు. ఆదివారం జరిగిన 131వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Details

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది

కృత్రిమ మేధస్సు, అంతరిక్ష పరిశోధనలు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ భారత్ వేగంగా పురోగమిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. దేశ యువత తమ ఆవిష్కరణలు, సృజనాత్మకతతో భారత్ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్లగల శక్తి కలిగి ఉందని ప్రశంసించారు. ఈ సదస్సు ద్వారా వివిధ దేశాల నాయకులు, టెక్నాలజీ దిగ్గజాలకు భారత యువత ప్రతిభ, నూతన ఆలోచనలను ప్రత్యక్షంగా పరిచయం చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. అలాగే, ప్రపంచ స్థాయి ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయాలని దేశంలోని తయారీదారులు, స్టార్టప్‌లకు సూచించారు.

Details

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, ముఖ్యంగా డిజిటల్ అరెస్టుల వంటి మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహంను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులను ప్రశంసించారు . తమ బిడ్డను కోల్పోయిన విషాదంలోనూ వారు తీసుకున్న నిర్ణయం అత్యంత అభినందనీయమని అన్నారు. ఆ అవయవ దానం వల్ల ఆ చిన్నారి నలుగురికి జీవనదాతగా మారిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు దేశంలో అవయవ దానంపై అవగాహన పెంచుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Advertisement