
పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ పైలెట్లను కొనసాగించాలని చూస్తోంది.
ఇందుకోసం పైలెట్లు సంస్థ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు భారీ వేతనాన్ని అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎయిర్‌లైన్ కెప్టెన్‌లకు నెలకు రూ. 1 లక్ష, ఫస్ట్ ఆఫీసర్లకు రూ.50,000 అదనంగా అందిచాలని నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఈ వేతనాల పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.
ఈ విషయంపై గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ పైలెట్లకు అంతర్గత మెయిల్స్ పంపినట్లు పేర్కొంది.
ఇప్పటికే రాజీనామా చేసిన వారు జూన్ 15లోగా రాజీనామాను ఉపసంహరించుకుంటే పెంచిన వేతనాలు వర్తిస్తాయని ఈ మేరకు గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తెలిపింది.
దిల్లీ
దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సిబ్బందికి బోనస్
దీర్ఘకాలం పాటు సేవలందిస్తున్న సిబ్బందికి బోనస్ కూడా అందిస్తామని సంస్థ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ చెప్పింది.
గో ఫస్ట్ కెప్టెన్‌లు సగటున నెలకు రూ. 5.30 లక్షలు సంపాదిస్తారు. స్పైస్‌జెట్‌లో అయితే రూ.7.50 లక్షల వేతనాన్ని పొందుతారు.
ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి ప్రత్యర్థి విమానయాన సంస్థలు దేశవ్యాప్తంగా భారీగా రిక్రూట్ చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ పైలెట్లు చాలా మంది రాజీనామా చేశారు.
అందురూ వెళ్లిపోతే, సంక్షోభం నుంచి గో ఫస్ట్ బయటపడ్డాక విమానాలు నడపడం ఇబ్బంది అవుతుందని భావించిన సంస్థ, పైలెట్లను వెళ్లకుండా కంపెనీలోనే కొనసాగించాలని చూస్తోంది.