LOADING...
Goa: మాజీ ముఖ్యమంత్రి, మంత్రి రవి నాయక్ హఠాన్మరణం
మాజీ ముఖ్యమంత్రి, మంత్రి రవి నాయక్ హఠాన్మరణం

Goa: మాజీ ముఖ్యమంత్రి, మంత్రి రవి నాయక్ హఠాన్మరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 79 ఏళ్ల రవి నాయక్ తన నివాసంలో గుండెపోటుకు గురికాగా, వెంటనే సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలువలేదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని పోండాలోని ఇంటికి తరలించారు. రవి నాయక్ మృతితో భార్య, ఇద్దరు కుమారులు,కోడళ్ళు,ముగ్గురు మనవరాళ్లు దుఃఖంలో మునిగిపోయారు. గోవా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవి నాయక్, ముఖ్యమంత్రి, మంత్రిగా దశాబ్దాలపాటు ప్రజా సేవలో అంకితభావంతో పనిచేశారని సీఎం సావంత్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని గుర్తుచేశారు.

వివరాలు 

రవి నాయక్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం 

రవి నాయక్ మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రాష్ట్ర సంతాప దినాలను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి, మంత్రి రవి నాయక్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ - "గోవా ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన రవి నాయక్ మరణం బాధాకరం. గోవా అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చూపిన శ్రద్ధ ప్రశంసనీయం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులతో నా సానుభూతి ఉంది. ఓం శాంతి" అని ప్రధాని ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

వివరాలు 

"రవి నాయక్ నాయకత్వం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం" - సీఎం సావంత్ 

రవి నాయక్ హఠాన్మరణం పట్ల గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంతాపం తెలిపారు. "గోవా రాజకీయాల్లో ప్రముఖుడైన రవి నాయక్ ముఖ్యమంత్రి, మంత్రిగా అనేక కీలక శాఖల్లో పని చేశారు. ఆయన నాయకత్వం, వినయం, ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులు, మద్దతుదారులకు నా హృదయపూర్వక సానుభూతి. ఓం శాంతి" అని సీఎం ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేసిన ట్వీట్