Andhra Pradesh: దానిమ్మ రైతులకు స్వర్ణయుగం: టన్ను రూ.2 లక్షలకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
ఈ వార్తాకథనం ఏంటి
కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దానిమ్మ రైతులకు మంచి సమయం వచ్చిందని రైతులు భావిస్తున్నారు. మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాల్లో దానిమ్మ పంట కోత ఆలస్యం కావడం వలన మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం,పండ్ల నాణ్యతను బట్టి వ్యాపారులు టన్నుకు సుమారు రూ.2 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర మూడు నెలల క్రితం టన్నుకు కేవలం రూ.50 వేలుగా ఉండగా,నెల క్రితం ఇది రూ.1 లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు చేరింది.
వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11,000 హెక్టార్ల భూములలో దానిమ్మ
రాష్ట్రంలో 15,422 హెక్టార్లలో దానిమ్మ పంట సాగుతోంది, దీని నుంచి సుమారు 3.85 లక్షల టన్నుల దిగుబడి పొందే అవకాశముంది. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11,000 హెక్టార్ల భూములలో దానిమ్మ పండుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానికంగా ఫ్రూట్ కవర్స్,ప్లాంట్ కవర్స్ విధానాలు పరిగణలోకి తీసుకోవడం వలన పండ్ల నాణ్యత గణనీయంగా మెరుగైనట్లు తెలుస్తోంది.