
గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వివిధ శాఖల్లో గ్రూప్ -1 ఖాళీలు 100, గ్రూప్ -2 ఖాళీలు 900 ఉన్నాయని ఉన్నతాధికారులు గురువారం సీఎంతో జరిగిన సమావేశంలో వెల్లడించారు.
ఈ క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని, పరీక్షల నిర్వహణ, రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఖరారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త సిలబస్‌ని విడుదల చేసిన ఏపీపీఎస్సీ
2023 గ్రూప్-2 పరీక్షల కోసం ఏపీపీఎస్సీ కొత్త సిలబస్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో 1000 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ కొత్త సిలబస్ ప్రకారం మొత్తం 450 మార్కులకు రెండు దశల రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సవరించిన సిలబస్ & పరీక్షా సరళి ప్రకారం, జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి మాత్రమే 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష నుంచి జనరల్ స్టడీస్‌ను మినహాయించారు. ఇందులో ప్రస్తుతం ఉన్న మూడు పేపర్లకు బదులుగా 150 మార్కుల రెండు పేపర్లను తీసుకురానున్నారు.