PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు
ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తూ, పీఎఫ్ జీతంలో కట్ అవుతున్నవారికి ఇది శుభవార్త. నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుండి రూ.7,500కి పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖకు EPS-95 జాతీయ కమిటీ 15 రోజుల నోటీసు ఇచ్చింది. ఒకవేళ ఈ డిమాండ్‌ను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బెదిరించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ EPS-95ని రిటైర్మెంట్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తూ ఆరు కోట్ల మంది చందాదారులు, 75 లక్షల మంది పెన్షనర్లకు సేవలందిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సోమవారం రాసిన లేఖలో ఈ కమిటీ ఈపీఎస్-95 పెన్షనర్ల మరణాలు తక్కువ పెన్షన్, వైద్య సదుపాయాల కొరత కారణంగా పెరుగుతున్నాయని పేర్కొంది.
డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరిక
15 రోజులలోపు కనీస పెన్షన్‌ను పెంచకపోతే రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధించి దేశవ్యాప్త ఆందోళనను చేస్తామని బెదిరించింది. నిర్ణీత వ్యవధిలో డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని కమిటీ డిమాండ్ చేసింది. అక్టోబర్ 4, 2016, నవంబర్ 4, 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. పెన్షనబుల్ జీతం కోసం ప్రస్తుత థ్రెషోల్డ్ నెలకు రూ.15,000. ఈ స్కీమ్‌లో చేర్చని రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో సభ్యులుగా చేయడం ద్వారా EPS-95 కవరేజీని విస్తరించాలని కమిటీ డిమాండ్ చేసింది. 2012-2013లో కోషియారీ కమిటీ సిఫార్సుల మేరకు కనీస పెన్షన్ పెంపుదల జరిగింది.