Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. పండుగ సమయానికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది.
రెగ్యులర్ సర్వీసులతో పాటు 2,400 అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నారని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్. విజయలక్ష్మి తెలిపారు.
ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని ఆమె వెల్లడించారు.
Details
ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధారణ చార్జీలతో ఈ బస్సులు ప్రయాణికులను తీసుకువెళ్లనున్నాయి.
ప్రయాణికులు ముందస్తుగా APSRTC వెబ్‌సైట్ ద్వారా లేదా అధికారిక టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
జనవరి 10 నుంచి 12 వరకు, ఎంజీబీఎస్ నుంచి కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపుకి ప్రత్యేక బస్సులు గౌలిగూడ సీబీఎస్ నుంచి నడిపిస్తారని తెలిపారు.