Loading...
Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు

Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలను విడుదల చేసింది. యూనిఫాం సర్వీసుల నియామకాల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లపాటు పెంచింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవోల్లో పేర్కొంది. అలాగే, రిజర్వుడు కేటగిరీల అభ్యర్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ వయోపరిమితి పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉద్యోగార్థులకు కూటమి ప్రభుత్వం భారీ భరోసా

ADVERTISEMENT