APSRTC: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రయాణికులకు శుభవార్త
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది.
ఈ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బస్టాండులు రద్దీగా ఉండడంతో, ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రైవేట్ వాహనాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో, అవి ఖాళీగా ఉండేలా చూసుకుని రద్దీ ప్రాంతాల్లో ఈ స్కూల్, కళాశాల బస్సులను ఉపయోగించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు విజయవాడలో చంద్రబాబు మీడియాతో మాట్లాడిన అనంతరం, అధికారులకు ఆదేశాలిచ్చారు.
రద్దీ ప్రాంతాలలో వెంటనే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల బస్సులను నడపాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీ, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు సూచించారు.
Details
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఈ బస్సులను ఆర్టీసీ ద్వారా నడపాలని, ప్రయాణికులకు కష్టాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
సంక్రాంతికి ముందు రెండవ శనివారం, ఆదివారం కలిసి రావడంతో, ప్రజలు రెండు రోజుల ముందుగానే స్వస్థలాలకు బయల్దేరడంతో జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది.
ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో ప్రజలు స్వస్థలాలకు తరలిపోతుండగా, టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రైల్వే స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.