Electricity bills: గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే!
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. ఇకపై గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులను మొబైల్ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలతో ఇటీవల యూపీఐ యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో మొబైల్ డిజిటల్ యాప్‌లతో సులభంగా చెల్లించే వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. ఇక విద్యుత్ బిల్లులను సులభంగా చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరాయి.
బీబీపీఎస్ లోకి చేరుతున్న విద్యుత్ సంస్థలు
డిస్కంలు బీబీపీఎస్‌లోకి చేరాయి. ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు, వెబ్‌సైట్‌లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ ఫాం ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని ఎన్‌పీసీఐకి చెందిన భారత బిల్ పే లిమిటెట్ సీఈఓ నూపూర్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వ్ బ్యాంకు జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలు బీబీపీఎస్‌లోకి చేరుతుండటంతో యూపీఐ చెల్లింపులకు అవకాశం లభించింది