Rythu Panduga: రైతులకు గుడ్‌న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ
మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రైతు పండగ శనివారం ఘనంగా ముగియనుంది. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన ఈ పండుగను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. రుణమాఫీ పథకం నాలుగో విడత కింద 3లక్షల మంది రైతులకు రూ.3,000 కోట్ల నిధులను విడుదల చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను మరింత స్పష్టతగా సీఎంను వెల్లడించే అవకాశం ఉంది. పంటలు, ప్రకృతి సేద్యం, వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర అంశాలపై వివరించే స్టాళ్లను ఏర్పాటు చేశారు.
రూ.3వేల కోట్ల నిధుల జమ
సాగు పద్ధతులపై డాక్యుమెంటరీ ప్రదర్శనలు చేపట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగే సభలో రైతుల కోసం కీలక విధానాలను సీఎం ప్రకటించనున్నారు. మొదటి మూడు విడతల్లో మొత్తం 22,22,067 మంది రైతులకు రూ.17,869.22 కోట్ల రుణాలు మాఫీ చేశారు. నాలుగో విడతలో ఇంకా మాఫీ కాలేని మూడు లక్షల మందికి రూ.3,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్‌లోని సభకు లక్ష మందికిపైగా రైతులను సమీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైతు పండగలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు.