TGSRTC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 213 కాలనీలకు బస్సులొచ్చాయ్..
ఈ వార్తాకథనం ఏంటి
మహానగర పరిధిలోని కొత్త కాలనీలకు ప్రజారవాణా సౌకర్యం మరింత విస్తరించింది. 'హైదరాబాద్ కనెక్ట్' కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ ఆర్టీసీ తాజాగా 213 కొత్త కాలనీలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రోజువారీ ప్రయాణ అవసరాలపై క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలన, అలాగే ట్రాఫిక్ పరిస్థితులపై అధ్యయనం అనంతరం ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ రీజనల్ మేనేజర్ సుధా పరిమళ వెల్లడించారు. మొత్తం 243 కాలనీల్లో బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, త్వరలో మిగిలిన కాలనీలకూ ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆమె తెలిపారు.
వివరాలు
డీపోల వారీగా ఇలా..
డిపో బస్సు కాలనీలు ఫలక్ నుమా 2 7 రాజేంద్రనగర్ 2 51 బండ్లగూడ 2 34 దిల్సుఖ్ నగర్ 2 55 హయత్ నగర్-1 4 11 ఇబ్రహీంపట్నం 4 14 మిధాని 3 41 మొత్తం 19 213