CRPF Jobs: భారీ ఉద్యోగావకాశాలు.. 9,195 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాల కోసం 10వ తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ప్రారంభం నుంచే మంచి వేతనం అందుతుంది.
వివరాలు
ఖాళీల వివరాలు ఇవే..
ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్) విభాగాల్లో మొత్తం 9,175 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 504 పోస్టులు
తెలంగాణకు సుమారు 353 పోస్టులు
దేశవ్యాప్తంగా మహిళల కోసం 79 పోస్టులు (ఏపీకి 3, తెలంగాణకు 3)
పయనీర్ విభాగంలోని కొన్ని పోస్టులు అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి.
వివరాలు
వేతనాలు, ఎంపిక విధానం ఇదే..
ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-3 ప్రకారం ప్రారంభ మూల వేతనం రూ.21,700 ఉంటుంది.
డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్సులు కలిపి నెలకు సుమారు రూ.40,000 వరకు వేతనం పొందే అవకాశం ఉంది. అనుభవం పెరిగే కొద్దీ పదోన్నతులు కూడా లభిస్తాయి.
నియామక ప్రక్రియను వివరాలివే:
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
ట్రేడ్/స్కిల్ టెస్ట్ (అవసరమైతే)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ పరీక్ష
వివరాలు
ఫిజికల్ టెస్ట్ వివరాలు ఇవే..
PET (శారీరక సామర్థ్య పరీక్ష) పురుషులు: 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. (లేదా పోస్టు ప్రకారం వేరే ప్రమాణాలు ఉండొచ్చు).
మహిళలు: 1.6 కిలోమీటర్లు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి.
PST (శారీరక ప్రమాణాలు) ఇవే:
పురుషుల ఎత్తు: 170 సెం.మీ
మహిళల ఎత్తు: 157 సెం.మీ
ఎస్టీ అభ్యర్థులకు కొంత సడలింపు ఉంటుంది.
పురుషుల ఛాతీ కొలత కనీసం 80 సెం.మీ (ఎస్టీలకు 76 సెం.మీ) ఉండాలి. బరువు, శరీర నిర్మాణం కూడా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
వివరాలు
రాత పరీక్ష విధానం ఇదే..
పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
మొత్తం 100 ప్రశ్నలు - 100 మార్కులు
పరీక్ష సమయం: 2 గంటలు
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది.
ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలో ఉంటాయి.
పరీక్ష భాషలు: హిందీ, ఇంగ్లీష్
అర్హత మార్కులు :
జనరల్: 30%
OBC/EWS: 25%
SC/ST: 20%
పయనీర్ పోస్టులకు అర్హత మార్కుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
వివరాలు
ఇతర ముఖ్య వివరాలు ఇవే..
డ్రైవర్ పోస్టులకు: 10వ తరగతి + హెవీ వెహికల్ లైసెన్స్ అవసరం.
ఇతర పోస్టులకు: 10వ తరగతి + ఐటీఐ లేదా అనుభవం అవసరం.
వయస్సు: 18 నుంచి 23 సంవత్సరాలు.
డ్రైవర్ పోస్టులకు: 21 నుంచి 27 సంవత్సరాలు
రిజర్వేషన్ ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు చివరి తేదీ: మే 19 దరఖాస్తు
ఫీజు: రూ.100
SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు వెబ్‌సైట్: http://www.rect.crpf.gov.in/