Budget 2026: ఎన్నారైలు,డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనారై పరిశ్రమకు శుభవార్త తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.ఈ బడ్జెట్‌లో భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే పరిమితి పెంపునకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భారత ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడం,ప్రపంచ స్థాయి మూలధనాన్ని ఆకర్షించడం లక్ష్యంగా కీలక చర్యలను ప్రకటించారు. గతంలో భారత కంపెనీల ఈక్విటీలలో ఎనారై పెట్టుబడి 10 శాతం ఉండగా.. ఇప్పుడు అదే పరిమితిని 24 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అదనంగా,పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్(PMS)ద్వారా లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పరిమితి 5 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. ఈ చర్యల కారణంగా భారత మార్కెట్‌లో భారీ నిధులు ప్రవహించే అవకాశం ఉంది.
వివరాలు
డేటా సెంటర్ల ఏర్పాటుపై శుభవార్త
భారతదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. 2047 వరకు కొత్తగా డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలీడే ప్రకటిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం క్లౌడ్ సేవల కంపెనీలకు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. గంటన్నర పాటు సాగిన నిర్మలా సీతారామన్ ప్రసంగం నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. సుమారు ఒక గంట 30 నిమిషాల పాటు ఆమె ప్రసంగం కొనసాగింది, ఇందులో ప్రధానంగా మార్కెట్ పరిమితులు, డేటా సెంటర్లకు సంబంధించిన మేనేజ్మెంట్ విధానాలు, పెట్టుబడి అవకాశాలపై ప్రస్తావించారు.