Vande Bharat: రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందింది. దేశంలో వందే భారత్(Vande Bharat) ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించుకుంది. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్-పూణే మార్గంలో కొత్తగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు వందే భారత్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదరణ పెరుగుతుండటంతో వీటి సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు.
దేశ వ్యాప్తంగా 33 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
ఇప్పటివరకూ మొత్తం 33 రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ 33 వందేభారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల మధ్య నడుస్తున్నాయి. వందేభారత్ రైళ్లలో ఇప్పటివరకూ ఏ ఇతర రైళ్లలోనూ లేని కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించడంలో వీటికి ఆదరణ పెరిగింది. ఈ రైళ్లకు విపరీతమైన డిమాండను దృష్టిలో ఉంచుకొని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులు సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రయాణికులకు మరింత సౌకర్యం ఏర్పడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.