Special Trains : ఏపీ,తెలంగాణ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. క్రిస్మస్,సంక్రాంతికి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలలో క్రిస్మస్,వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని, పలు ప్రదేశాలకు ప్రత్యేక రైళ్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైలు సర్వీ సులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి-బ్రహ్మపూర్ (07027): డిసెంబర్ 12 నుండి జనవరి 30 వరకు ప్రతి శుక్రవారం. బ్రహ్మపూర్-చర్లపల్లి (07028): డిసెంబర్ 6 నుంచి జనవరి 31 వరకు ప్రతి శనివారం. చర్లపల్లి-అనకాపల్లి (07035): డిసెంబర్ 6 నుండి జనవరి 17 వరకు ప్రతి శనివారం.
వివరాలు
సికింద్రాబాద్ - అనకాపల్లి రూట్లో 34 ప్రత్యేక రైళ్లు
అనకాపల్లి-చర్లపల్లి (07036): డిసెంబర్ 7 నుండి జనవరి 18 వరకు ప్రతి ఆదివారం. జాల్నా-ఛప్రా (07651): డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం. ఛప్రా-జాల్నా (07652): డిసెంబర్ 5 నుంచి జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం. మరిన్ని సౌకర్యాల కోసం, సికింద్రాబాద్ - అనకాపల్లి రూట్లో 34 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపారు. సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైలు (07055): డిసెంబర్ 4 నుండి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ప్రతి గురువారం అనకాపల్లికి. అనకాపల్లి నుండి ప్రత్యేక రైలు (07056): డిసెంబర్ 5 నుండి మార్చి 27 వరకు ప్రతి శుక్రవారం.
వివరాలు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం శాశ్వత అదనపు కోచ్‌ల ఏర్పాటు
ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగతాయి. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం శాశ్వత అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు. తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి వెల్లడించిన ప్రకారం: సికింద్రాబాద్-తిరుపతి (20701) తిరుపతి-సికింద్రాబాద్ (20702) రైళ్లకు ఇప్పటికే 14 ఏసీ చైర్‌కార్‌లు ఉన్నాయి. వాటిని 18కి పెంచారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఎప్పటిలాగే రెండు కోచ్‌లతో కొనసాగుతుందని తెలిపారు. కొత్త కోచ్‌లు బుధవారం నుండి అందుబాటులోకి వచ్చాయి.