
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందనుంది. విమాన ప్రయణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ తీసుకొచ్చింది.
దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్ విధానంతో ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండనుంది.
నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యం లేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది.
ప్రయాణికుడు గమ్యస్థానానికి చేరుకోవడానికి నేరుగా బస్సు లేనప్పుడు మధ్యలో ఓ ప్రాంతంలో దిగి అక్కడి నుంచి మరో బస్సులో ప్రయాణించి గమ్యానికి చేరుకొనే అవకాశం ఉంటుంది.
Details
మొదటి దశలో 137 పట్టణాలకు వర్తింపు
రెండు బస్సుల్లో ప్రయాణించాలంటే ముందుగా ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలి. తొలి బస్సు నుంచి దిగిన తర్వాత 2 నుంచి 22 గంటల వ్యవధిలో రెండో బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది.
మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్లీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో మరిన్ని పట్టణాలను ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ ప్రారంభించనున్నారు.
ఈ వ్యవస్థను తీసుకొస్తున్న తొలి సంస్థగా ఆర్టీసీ చరిత్ర సృష్టించనుంది.