Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా ఆరు రోజులు సెలవులు
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ ఈ సెలవులను డిక్లేర్ చేసింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ వరుసగా సెలవులు ఉంటాయని వెల్లడించింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక కళాశాలలకు ఎప్పుడు సెలవులు ఉంటాయన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
నెలలో సగం రోజులు సెలవులు
తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో పాటు జవనరి 7, 14, 21, 28న ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి. మరోవైపు 26న రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు సెలవు ఉండనుంది. ఇక మొత్తానికి ఈ నెల మొత్తం దాదాపు సంగ రోజులు తెలంగాణ స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించడంతో విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి.