School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపు ఆప్షనల్ హాలీడే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈసారి మహాశివరాత్రి ఆదివారం రావడంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకింగ్ సంస్థలకు సాధారణ సెలవు వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కూడా అదనంగా సెలవు ప్రకటించింది. ఐచ్చిక (ఆప్షనల్) హాలీడేగా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారని గుర్తుచేస్తూ, ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని సోమవారం ఆప్షనల్ సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది
Details
ఉద్యోగులకు కూడా సెలవు
. ఫిబ్రవరి 16న ఐచ్చిక సెలవు ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. శివరాత్రి జాగరణ అనంతరం మరుసటి రోజు కార్యాలయాలకు హాజరవ్వడం ఇబ్బందిగా ఉంటుందని ఉద్యోగులు వినతి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే డిసెంబర్ 4న విడుదల చేసిన అధికారిక సెలవుల జాబితాలో సవరణలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం ఐచ్చిక సెలవు తీసుకునే అవకాశం పొందారు.
Details
స్కూళ్లకు కూడా ఐచ్చిక సెలవు
ఫిబ్రవరి 16న రాష్ట్రంలోని పాఠశాలలకు కూడా ఆప్షనల్ హాలీడే ప్రకటించినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. అయితే పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు జరుగుతున్న కారణంగా పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరై ప్రీ-ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. మహాశివరాత్రి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 16 సాయంత్రం 5.34 గంటల వరకు కొనసాగుతుంది. ప్రధాన పర్వదినం ఫిబ్రవరి 15ననే జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాలు 16న సెలవు ప్రకటించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో 15నే పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 16న ఐచ్చిక సెలవు మంజూరు చేశారు.