LOADING...
Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్‌ బిల్లులకు రూ.700 కోట్లు రిలీజ్‌
తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్‌ బిల్లులకు రూ.700 కోట్లు రిలీజ్‌

Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్‌ బిల్లులకు రూ.700 కోట్లు రిలీజ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల కోసం భారీగా నిధులను విడుదల చేసింది. శనివారం మాత్రమే ఆర్థికశాఖ నుంచి మొత్తం రూ.700 కోట్లను అన్ని శాఖల ఉద్యోగుల వేతన ఖాతాల్లో జమ చేసింది. వీటిలో 20 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లుల కోసం ఏకంగా రూ.392కోట్లను ఒకేసారి విడుదల చేశారు. ప్రతినెలా జీతభత్యాల కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి బిల్లులను ఖజానా శాఖకు పంపడం ఆనవాయితీగా ఉంది. ఈ ప్రక్రియలో ఏదైనా ఉద్యోగి జీతభత్యాలకు సంబంధించిన వివరాలు మిస్సయితే, అదే కార్యాలయం తిరిగి సప్లిమెంటరీ పద్ధతిలో బిల్లును సమర్పిస్తుంది. రెండేళ్లలో ఇలాగే సమర్పించిన సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఇంకా రూ.1,900 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేయాల్సి ఉంది.

Details

రూ.10వేల కోట్ల వరకు బకాయిలు

జూన్‌లో మంత్రివర్గం ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం ప్రతి నెల రూ.700 కోట్ల చొప్పున దశలవారీగా ఇస్తామని నిర్ణయించింది. ఆ క్రమంలో ఈ నెలకు సంబంధించిన రూ.700 కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక సప్లిమెంటరీ వేతన బిల్లులతో పాటు జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (GPF) బిల్లులకు మరో రూ.308 కోట్లను విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛన్‌దారుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఐకాస) ఛైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇంకా ఉద్యోగుల బిల్లులకు సుమారు రూ.10 వేల కోట్ల వరకు రావాల్సి ఉందని వారు స్పష్టం చేశారు.