
PMFBY: తెలంగాణ రైతులకు శుభవార్త.. పీఎంఎఫ్‌బివైలో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో కీలక మార్పులు చేసి, పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయే రైతులకు భరోసా అందించబడుతుంది. తాజా మార్పుల ప్రకారం, కోతల తర్వాత కూడా బీమాను కొనసాగిస్తారు, అలాగే పాడి, ఆక్వా రంగాల పంటలను కూడా పథకంలో చేర్చనున్నారు. ప్రస్తుతం ఏటా సుమారు 4 కోట్ల మంది రైతులు PMFBYలో నమోదు అవుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకంగా గుర్తింపు పొందింది. ప్రీమియం పరంగా చూసుకుంటే, ప్రపంచంలో మూడో అతిపెద్ద పథకమే ఇది.
Details
అధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న ప్రభుత్వం
ప్రారంభంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, వార్షిక వాణిజ్య పంటలకే ఈ పథకం వర్తించేది, తరువాత ఉద్యాన పంటలు (పండ్లు, కూరగాయలు) కూడా చేర్చారు. పథకం కేవలం పంట నష్టం మాత్రమే కాకుండా, వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, మంచు, వడగళ్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే నష్టాలకూ రక్షణ అందిస్తుంది. దిగుబడులను ఖచ్చితంగా అంచనా వేయడానికి, క్లెయిమ్‌లను త్వరగా చెల్లించడానికి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందులో పంటల విస్తీర్ణం నమోదు, నష్టం అంచనా, క్లెయిమ్ పరిష్కారంలో కృత్రిమ మేధను (AI) ఉపయోగించడం, పంటల రియల్ టైం ఫొటోలు, సమాచార సేకరణ వంటి టెక్నాలజీని అనుసంధానించడం జరుగుతుంది.
Details
ప్రతి రైతుకు గుర్తింపు కార్డు
ప్రతి బీమా రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వడం, భూమికి జియోట్యాగింగ్ చేయడం, PMFBY వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రైతుల సమాచారాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతోంది. దిగుబడి అంచనాలకు 70 శాతం పంట కోత ప్రయోగాలను, మిగిలిన 30 శాతం కోసం సాంకేతికతను ఉపయోగిస్తారు. ప్రచలిత సమస్యలలో, పంట కోసిన తర్వాత నిల్వ సమయంలో అకాల వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోతున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం కొత్త మార్పుల ద్వారా రైతులు తమ పంటను అమ్మేవరకు పథకాన్ని వర్తింపజేసేలా చేశారు.