LOADING...
Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ 'రైతు భరోసా' రెండో విడత నిధుల విడుదల
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ 'రైతు భరోసా' రెండో విడత నిధుల రిలీజ్

Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ 'రైతు భరోసా' రెండో విడత నిధుల విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ రెండో విడత నిధులను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో మొదటి విడత నిధులను గత నెల 23వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది.

వివరాలు

రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ

ఆ సమయంలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని ముందుగా అందిస్తూ, దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇవాళ విడుదల చేయనున్న రెండో విడతలో 45,11,947 మంది రైతులు 'రైతు భరోసా' సాయం పొందనున్నారు. ఈ విడతలో మొత్తం రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత తర్వాత మూడో విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

వివరాలు

మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన

ఈ పర్యటనలో భాగంగా ఆయన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. గతంలో బ్యారేజీ కుంగుబాటుకు గురైన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. డ్యామ్ సైట్‌ను సందర్శించిన అనంతరం సాగునీటి శాఖ అధికారులతో అక్కడే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టు మరమ్మతులు, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. మేడిగడ్డ వద్దే మీడియాతో మాట్లాడి ప్రాజెక్టు పరిస్థితిపై వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

Advertisement

వివరాలు

నస్తురాపల్లి వద్ద భారీ బహిరంగ సభ

కాళేశ్వరం పర్యటన అనంతరం, కాటారం మండలం నస్తురాపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతు భరోసా' రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసే ప్రక్రియకు ఇక్కడ శ్రీకారం చుట్టనున్నారు.

Advertisement