తెలంగాణ రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ
తెలంగాణలోని రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ నుంచి పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రయోగాత్మకంగా సరఫరా చేస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మార్చి నెలలో మిగిలిపోయిన బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేయొద్దని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ షాపు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం 90లక్షల మందికి లబ్ధి
పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం 90లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. నెలకు రాష్ట్రప్రభుత్వం దాదాపు 1.90లక్షల టన్నుల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేస్తోంది. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా సరఫరా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వపై అదనంగా రూ.31.20కోట్ల భారం పడనుంది. దేశ ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలు మిళితం చేసిన బియ్యాన్ని సరఫరా చేయాలని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగునంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తోంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి