Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను అందించారు. సూపర్ సిక్స్ అమల్లో భాగంగా కొత్త కార్యక్రమాన్ని ప్రకటించిన ఆయన, P-4 అనే పథకాన్ని వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. పేదరికం లేని సమాజం ఏర్పాటు లక్ష్యంగా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ సేవకుల కుటుంబాలకు మద్దతు అందించనున్నట్లు చెప్పారు. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయనున్నామని, డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈ హోదా కల్పిస్తామని వివరించారు. అనంతరం బెజవాడలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల గురించి మాట్లాడారు.
దీపావళి సందర్భంగా మూడు గ్యాస్ సిలిండర్లు
గత ప్రభుత్వ పాలన వల్లే విజయవాడ వరద నీటిలో మునిగిపోయిందని అన్నారు. తన నాయకత్వంలో వరద సాయం కింద రూ. 450 కోట్ల విరాళాలు వచ్చాయని చెప్పారు. ఇక అనంతపురంలో జరిగిన ఘటనలపై కూడా చంద్రబాబు తన గళాన్ని వినిపించారు. రథం తగులబెట్టిన నేరాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేసినారని, రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు ఎంక్వైరీ చేయలేదని విమర్శించారు. దీపావళీ సందర్భంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. 2027 నాటికి ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీన్ని టూరిజం స్పాట్‌గా మార్చుతామని తెలిపారు.