
Toll Charges: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు సగానికి తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. జాతీయ రహదారులపై వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్న రూట్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు 2008 నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్న టోల్ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. జూన్ 2న విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ తగ్గింపులు అమల్లోకి వచ్చాయి. దీని వల్ల ప్రయాణదారులకు టోల్ ప్లాజాల వద్ద చెల్లించే రుసుము సగానికి తగ్గనుంది. ఇప్పటి వరకు టోల్ ఫీజుల వసూలు పాత ప్రణాళిక ప్రకారం కొనసాగుతుండగా.. ఈ మార్పులతో వాహనదారులపై ఆర్థిక భారం కొంత మేరకు తగ్గనుంది.
Details
వాహనదారులకు గొప్ప ఊరట
ముఖ్యంగా సొరంగాలు, వంతెనలు, ఎలివేటెడ్ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు ఇది గొప్ప ఊరటగా మారనుంది. కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయం.. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రయాణ ఖర్చులను తగ్గించడంలో సహాయకరంగా నిలవనుంది. ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు, టోల్ పాయింట్ల లిస్టు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది.