
Deepfake: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తాం: కేంద్ర మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునే అంశంపై చర్చించేందుకు గురువారం, శుక్రవారాల్లో సోషల్ మీడియా సంస్థల అధికారులతో ఐటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రెండు సమావేశాలు నిర్వహించనుంది.
రైల్‌భవన్‌లో గురువారం జరగనున్న సమావేశంలో డీప్‌ఫేక్ వీడియోలపై ప్రధానంగా చర్చించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
కేంద్రం ఇప్పటికే చాలా కష్టపడి IT రూల్స్‌ని రూపొందించినట్లు చెప్పారు. డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. అలాగే దీనికోసం ఫ్రేమ్‌వర్క్‌ను కూడా రూపొందిస్తామని వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈ నెల 23, 24 తేదీల్లో కేంద్రం చర్చలు
#India Mulls Law Against Deepfakes Amid #SocialMedia Crackdown
— Herald Goa (@oheraldogoa) November 22, 2023
Read: https://t.co/mllgMWxena#Goa #news #India #Deepfake pic.twitter.com/VfNSaneMS0