LOADING...
Visakhapatnam: రుషికొండ బీచ్‌ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం
రుషికొండ బీచ్‌ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం

Visakhapatnam: రుషికొండ బీచ్‌ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

రుషికొండ బీచ్‌ పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బీచ్‌కు బ్లూఫాగ్‌ హోదా కొనసాగించే లక్ష్యంతో చర్యలను వేగవంతం చేసింది. బీచ్‌పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బీచ్‌ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. బీచ్‌కు బ్లూఫాగ్‌ గుర్తింపు రద్దుకు కారణమైన ఇద్దరు అధికారులను ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణిని బదిలీ చేయడమే కాకుండా, తక్షణమే రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో జి.దాసును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.