LOADING...
KTR: కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

KTR: కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు అవినీతి నిరోధక బ్యూరోకు(ఏసీబీ)రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అనుమతి లభించింది. ఈవిషయానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే అనేకసార్లు ఏసీబీ ముందు హాజరై వివరణ ఇచ్చినట్లు తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహణలో సుమారు రూ.54.88కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది. ఈనేపథ్యంలో,కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని ఏసీబీ గతంలో గవర్నర్‌కు లేఖ రాసి, ఆయనపై తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. తాజాగా ఈ అభ్యర్థనను గవర్నర్ పరిశీలించి,ఏసీబీ ముందుకు సాగేందుకు ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ సిద్ధం చేసే ప్రక్రియ కూడా వేగవంతమై, త్వరలోనే కోర్టులో దాఖలు కానున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి.