
Porn Sites: పోర్న్ యాప్ లపై కేంద్రం కొరడా.. ఉల్లు, ఆల్ట్ బాలాజీ తదితర ఓటీటీలపై నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
ఓటిటి వేదికల్లో ఉదృతంగా పెరిగిపోతున్న అభ్యంతరకర కంటెంట్ ప్రసారం విషయంలో కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. అశ్లీలతకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా,కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ పలు కఠిన చర్యలు ప్రారంభించింది. అసభ్య,అశ్లీల చిత్రాలను ప్రదర్శిస్తున్న కొన్ని ఓటీటీ యాప్‌లు,వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉల్లు, ఏఎల్‌టీటీ సహా కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి మంత్రిత్వశాఖ తాజాగా అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉల్లు, ఆల్ట్ బాలాజీ తదితర ఓటీటీలపై నిషేధం
Breaking: Govt bans Ullu, ALTT, Desiflix, Big Shots and other apps for showing soft porn content. https://t.co/82QqvBXzN0
— Abhijit Majumder (@abhijitmajumder) July 25, 2025
వివరాలు
24 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం
ఈ చర్యలలో భాగంగా మొత్తం 24 యాప్‌లు,వెబ్‌సైట్లను కేంద్రం నిషేధించింది. వీటి యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేయాలంటూ, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISP) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే, చట్టపరంగా పొందే రక్షణను ఆయా సంస్థలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. "ఉల్లు, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్, దేశీఫ్లిక్స్, గులాబ్ యాప్ తదితర సంస్థలు పునరావృతంగా నియమాలు అతిక్రమించి అసభ్య కంటెంట్‌ను తమ వేదికలలో ప్రసారం చేస్తున్నట్లు గుర్తించాం. దాంతోపాటు వీటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది," అని కేంద్ర మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
వివరాలు
తొలగించిన యాప్స్, వెబ్‌సైట్స్ ఇవే..
ఓటీటీ ప్రసార యాప్‌లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం ఈ సందర్భంగా గుర్తుచేసింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జాల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫినియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్‌ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్, ట్రైఫ్లిక్స్