LOADING...
Telangana News: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్‌కి ఎస్టిమేట్ వ్యయం రద్దు.. ఈఆర్‌సీ కీలక ఉత్తర్వులు
ఈఆర్‌సీ కీలక ఉత్తర్వులు

Telangana News: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్‌కి ఎస్టిమేట్ వ్యయం రద్దు.. ఈఆర్‌సీ కీలక ఉత్తర్వులు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎవరైనా కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ కోసం డిస్కంకు దరఖాస్తు చేస్తే, తమకు అనుకూలంగా కొందరు కాంట్రాక్టర్లు "అంచనా వ్యయం" పేరుతో సొమ్ము వసూలు చేస్తున్న దందాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఎస్టిమేట్‌ తయారీ నిబంధనలు పూర్తిగా రద్దు చేసింది. గురువారం నుంచి ఈ ఆదేశాల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు)కొత్త నిబంధనలను అమలు చేయడం ప్రారంభించాయి. ఈ కొత్త మార్గదర్శకాలు కొత్త కనెక్షన్‌లు,అదనపు లోడ్‌ జారీకి సంబంధించి మార్పులు,స్పష్టమైన నియమాలను సూచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2015లో విద్యుత్తు నియమావళికి ఒకసారి సవరణ చేయగా.. పదేళ్ల తర్వాత మరో కీలక సవరణ చేసినట్లు ఈఆర్‌సీ వివరించింది.

వివరాలు 

ముఖ్యాంశాలివి..

ఇందులో ఎవరైనా కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేస్తే తక్షణమే మంజూరు చేయాలని, ఎలాంటి అదనపు చెల్లింపులు సిబ్బంది అడగరానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏదైనా అపార్ట్మెంట్ లేదా వాణిజ్య భవనంలో కొంత భాగం కొన్నవారి నుంచి బిల్డర్లు 'డెవలప్‌మెంట్‌ ఛార్జీ' లేదా ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు వ్యయం పేరుతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇకపై అలా చేయరాదు. అపార్ట్మెంట్‌లు, వాణిజ్య భవనాలకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ వ్యయాన్ని డిస్కంలు విడిగా వసూలు చేయలేవు. భవనంలో ఫ్లాట్లు, లిఫ్ట్, వాటర్ కనెక్షన్‌ల కోసం అవసరమైన మొత్తం లోడును లెక్కించాలి. ప్రతి కిలోవాట్‌కు రూ.10,000 చెల్లించాలి, అదనంగా రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టాలి.

వివరాలు 

ముఖ్యాంశాలివి..

వాణిజ్య భవనాలకూ ఇదే నిబంధన. రుసుములు చెల్లించిన భవనాలకు డిస్కం నేరుగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలి. అదనపు ఫీజులు వసూలు చేయరాదు. వినియోగదారుడి ఖర్చుతో ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా డిస్కం నిర్వహించాలి; ఇతరులకు కనెక్షన్ ఇవ్వరాదు. కొత్త రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ఖర్చు భరించాలి. పొలంలో కొత్త బోరు వేసిన రైతు కనెక్షన్ కోసం ప్రతి కిలోవాట్‌కు రూ.1,000 మాత్రమే డిస్కం వసూలు చేయగలదు. విద్యుత్ వాహన ఛార్జింగ్‌ స్టేషన్లకు: 20 కిలోవాట్లలోపు: రూ.3,400 20 కిలోవాట్ల కంటే ఎక్కువ: రూ.8,000 ఈ రుసుములో సర్వీస్‌లైన్, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు ఉంటాయి. 20 కిలోవాట్ల మించితే కేవలం సర్వీస్‌లైన్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలి.

Advertisement

వివరాలు 

ముఖ్యాంశాలివి..

ఇప్పటికే అమల్లో ఉన్న డెవలప్‌మెంట్‌ ఛార్జీలు: గృహ అవసరాలు: కిలోవాట్‌కు రూ.1,646, వాణిజ్య అవసరాలు: కిలోవాట్‌కు రూ.2,275 గృహ విభాగంలో ఇంటి విస్తీర్ణం ఆధారంగా కనీస లోడ్‌ను నిర్ణయించాం. ఉదాహరణకు 500 చదరపు అడుగుల ఇంటికి కనీసం 2 కిలోవాట్ల లోడ్. ఉదాహరణకు ఒక అపార్టుమెంటులో మొత్తం 30 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. 30 ఫ్లాట్లు × 3 కిలోవాట్లు = 90 కిలోవాట్లు కామన్ వినియోగం (లిఫ్ట్, వాటర్) = 10 కిలోవాట్లు మొత్తం = 100 కిలోవాట్లు → రూ.10,20,000 డిస్కం‌కు చెల్లించాలి. ఒక్కో ఫ్లాట్‌కి రూ.34,000 మాత్రమే చెల్లించాలి.

Advertisement

వివరాలు 

ముఖ్యాంశాలివి

కనెక్షన్‌లోడ్ 20 కిలోవాట్లలోపు ఉంటే, ఒక్కో కిలోవాట్‌కు రూ.4,600 చెల్లించాలి. రైతులు సాధారణంగా 5 హెచ్‌పీ బోరు మోటార్లకు 3.8 కిలోవాట్ల లోడ్ కోసం రూ.3,800 చెల్లిస్తారు, అదనంగా కిలోవాట్‌కు రూ.1,200 డెవలప్‌మెంట్ రుసుం. 'అవుట్‌రైట్‌ కంట్రిబ్యూషన్‌ (ORC)' పేరుతో ఇప్పటి వరకు వసూలు చేసిన అదనపు రుసుములు నిలిపివేయాలని ఈఆర్‌సీ స్పష్టంగా చెప్పారు.

Advertisement