LOADING...
Defence Acquisition Council: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం

Defence Acquisition Council: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్‌లో 88 సింగిల్ సీటర్‌లు, 26 డబుల్ సీటర్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటిలో 18 విమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా దిగుమతి చేసుకోనుండగా, మిగతా 90కి పైగా విమానాలను ఫ్రాన్స్‌కు చెందిన Dassault Aviation సహకారంతో భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాఫెల్ విమానాల విడిభాగాల తయారీ కోసం Hyderabadలో అత్యాధునిక ఉత్పత్తి కేంద్రం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

సరిహద్దుల వెంట ఉద్రిక్తతలతో..

ప్రస్తుతం Indian Air Force వద్ద 30స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో,ఈ కొత్త యుద్ధ విమానాల చేరికతో స్క్వాడ్రన్ల లోటు గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే సేవలో ఉన్న 36రాఫెల్ విమానాలు,నేవీ కోసం ఆర్డర్ చేసిన మరో 26 జెట్లతో కలిపి,రానున్న రోజుల్లో భారత్ వద్ద మొత్తం 176 రాఫెల్ యుద్ధ విమానాలు అందుబాటులో ఉండనున్నాయి. China, Pakistan సరిహద్దుల వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని దేశ గగనతల రక్షణను మరింత పటిష్టం చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విమానాల్లో అత్యాధునిక మీటియోర్, స్కాల్ప్ క్షిపణులు అమర్చనుండగా, అవి శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Advertisement