LOADING...
Bhatti Vikramarka: ఉగాది పండగ రోజున ఘనంగా గద్దర్‌ అవార్డుల ప్రదానం..  

Bhatti Vikramarka: ఉగాది పండగ రోజున ఘనంగా గద్దర్‌ అవార్డుల ప్రదానం..  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఉగాది పండగ రోజున గద్దర్‌ సినిమా అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నెల 6 నుండి గద్దర్‌ అవార్డుల కోసం స్క్రీనింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు, డా. సి. నారాయణరెడ్డి పేర్లతో ప్రత్యేక అవార్డులు కూడా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

వివరాలు 

అవార్డుల ఎంపికకు జ్యూరీ సభ్యులను ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సిఫార్సు

హైదరాబాద్‌లో బుధవారం జరిగిన గద్దర్‌ అవార్డుల జ్యూరీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోని అన్ని భాషల సినిమాల చిత్రీకరణకు హైదరాబాద్‌ అనుకూలమైన నగరంగా ఉంది. నగరం సినిమాలకు కేంద్రంగా మారటంతో పరిశ్రమకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ఇక్కడ సినిమాల అభివృద్ధి జరగడం ద్వారా టెక్నీషియన్లు, రచయితలు, దర్శకులు, ఇతర విభాగాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అవార్డుల ఎంపికకు జ్యూరీ సభ్యులను ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సిఫార్సు చేసాము. కమర్షియల్‌ అంశాలతోపాటు సామాజిక సందేశం ఉన్న సినిమాలను ప్రోత్సహించడం ద్వారా మంచి సినిమాలకు గుర్తింపు లభిస్తుంది" అని చెప్పారు.

వివరాలు 

కార్యక్రమంలో పాల్గొన్నవారు..

ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ ప్రియాంక, కిశోర్‌ బాబు, తనికెళ్ల భరణి, కేఎస్‌ రామారావు, రోజారమణి, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement