Rajasthan Governor: న్యూటన్ కంటే ముందే వేద గ్రంథాలలో గురుత్వాకర్షణ: రాజస్థాన్ గవర్నర్
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.1687లో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని(Theory of Gravity)గుర్తించడానికి చాలా ముందే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని తెలిపారు.
జైపూర్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ బాగ్డే ఈ వ్యాఖ్యలు చేశారు.
''భారతదేశం పురాతన కాలం నుంచే విజ్ఞాన కేంద్రంగా నిలిచింది.నలందా విశ్వవిద్యాలయంలాంటి విద్యాసంస్థలకు దేశ-విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు.డెసిమల్ వ్యవస్థను ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదే. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ చాలా ఆలస్యంగా పేర్కొన్నారు. అయితే, వేదాల్లో అయితే చాలా ముందే గ్రావిటీ గురించి ప్రస్తావన ఉంది. విద్యుత్, విమానాలు, ఇతర శాస్త్రీయ విషయాలు మన చరిత్ర గ్రంథాలు, ఋగ్వేదంలో చేర్చబడ్డాయి'' అని బాగ్డే తెలిపారు.
వివరాలు
1190లలో నలంద లైబ్రరీ దహనం
అయితే, భారతీయ విజ్ఞానాన్ని అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని, పురాతన భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని చెరిపివేయడానికి కొంతమంది కుట్రలు చేసినట్టు పేర్కొన్నారు.
1190లలో నలంద లైబ్రరీ దహనం ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.
ఈ సందర్భంలో, విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ, నేర్చుకోవడానికిషార్ట్‌కర్ట్స్ (shortcut) లేవని, మేధో సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే నిరంతరం పుస్తకాలను చదవాలని గవర్నర్ సూచించారు.