Kakinada: వలస పక్షులతో కళకళలాడుతున్న కోరంగి అభయారణ్యం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 28, 2026
12:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్య పరిధిలో గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు ఆకర్షణగా మారాయి. గతంలో 2025లో కేవలం ఒక గ్రేటర్ ఫ్లెమింగో మాత్రమే ఇక్కడకు వలస వచ్చిందని అధికారులు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు 70 ఫ్లెమింగోలు చేరుకోవడం విశేషమని డీఎఫ్‌వో రామచంద్రరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ తెలిపారు. కోరంగి ప్రాంతంలోని విస్తారమైన చిత్తడి నేలలు, ఆహార లభ్యత ఈ పక్షులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని వన్యప్రాణి విభాగానికి చెందిన శాస్త్రవేత్త డి. మహేష్‌బాబు వివరించారు. మంగళవారం ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో ఈ గ్రేటర్ ఫ్లెమింగోల దృశ్యాన్ని చిత్రీకరించారు.